Posts

తప్పిపోయిన కుమారుడు

 ఒక ఊరిలో ఒక తండ్రి కి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు తనకు రావాల్సిన  ఆస్తి వాటా తన తండ్రి నీ అడిగి తీసుకున్నాడు తండ్రి ప్రేమతో తన వాటా తనకి ఇచ్చాడు  ఆ కుమారుడు దూర ప్రాంతంకు వెళ్ళి  తన ఆస్తిని వ్యర్థము గా ఖర్చు చేసాడు కొంత కాలం కి అతను పూర్తిగా దరిద్రుడు అయ్యాడు  ఆకలి తో బాధపడుతూ పందులుకు ఆహారం పెట్టె పనికి చేరదు అప్పుడు a అతనికి తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది  తన తండ్రీ ఇంటిలో పని వాళ్ళకే మంచి ఆహారం ఉంటుంది నేను తప్పు చేశాను తిరిగి వెళ్ళి క్షమాపణ అడుగుతాను అనుకున్నాడు అతను  తిరిగి వస్తున్నప్పుడు దూరం నుంచి ఏ తండ్రి చూసి పరిగెత్తుకుంటూ  వచ్చి కౌగలించుకున్నాడు నాన్న నేను దేవునికి మీకు వ్యతిరేకం గా పాపం చేశాను నన్ను క్షమించండి అని క్షమాపణ కోరాడు  తండ్రి అందుకు కుమారుడిని మందలించలేదు అందుకు గానం గా వేడుక చేశాడు  ఈ కథ లో నీతి ఏమిటి అంటే మనం ఎన్ని తప్పులు చేసిన  దేముడు క్షమిస్తాడు దేవుని ప్రేమ మారదు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే దేవుడు సేకరిస్తాడు  దేవుని ప్రేమ ఎప్పుడు ఒకేళగా వుంటుంది 

ప్రతి రోజు బైబిల్ చదవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు

 ప్రతి రోజు బైబిల్ చదవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు  మన జీవితంలో ప్రతి రోజు ఎన్నో సమస్యలు ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయి ఈ సమయంలో సరి అయినా మార్గదర్శనం అవసరం   మనకు సరి అయినా మార్గం చూపించేది దేవుని వాక్యం  ప్రతి రోజు బైబిల్ చదవడం ద్వారా  మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తుంది  బైబిల్ దేవుని వాక్యం  దేవుని వాక్యం ఆత్మకు ఆహారం ప్రతి రోజు వాక్యం చదివితే ఆత్మీయ జీవితం బలపడుతుంది దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది మనసుకు శాంతి కలుగుతుంది    కష్టం లో దైర్యం కలుగుతుంది సరి అయినా నిర్ణయం తీసుకునే జ్ఞానం వస్తుంది పాపం నుంచి దూరం చేస్తుంది మంచి చెడు తెలియచేస్తుంది దేవుని వాక్యం బాధలో ఓదార్పు లభిస్తుంది మనం అనుకునే కార్యాలు జరుగుతాయి దేవునికి దగ్గిర అవుతాం  బైబిల్ చదవడం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం 

కష్టం లో దేవుని సహాయం

కష్టం లో దేవుని సహాయం  మన జీవితంలో కష్టాలు, బాధలు, సమస్యలు సహజం కానీ ఆ సమయంలో తోడుగా నిలిచేది దేముడు మాత్రమే మనుషులు దూరం ఐనా దేవుడు ఎప్పుడూ మనకు సమీపంగా ఉంటాడు యెషయా 41: 10  అధ్యాయంలో దేవుడు ఇలా అన్నాడు నీవు భయపడకుము, నేను నీతో ఉన్నాను ఈ మాట వింటే మనసుకి చాలా దైర్యం వస్తుంది కష్టం లో దేవునికి ప్రార్ధన చెయ్యడం ద్వారా మనసుకి శాంతి ఓదార్పు లభిస్తుంది మన సమస్యను దేవునితో చెప్పినప్పుడు ఆయనే మనకు ఆ సమస్య నుంచి బయట పడడానికి దేముడు మార్గం చూపిస్తాడు  దేవునిపై విశ్వాసం ఉంచితే అద్భుతం చూస్తాం దేవుని మీద నమ్మకం ఉంచాలి

విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి

విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి విశ్వాసం అనేది కనిపించని దానిపై నమ్మకం పరిస్థితులు అనుగుణంగా లేకపోయినా దేవుడు చేస్తున్నాడు అని హృదయ పూర్వకంగా నమ్మడం అదే నిజమైన విశ్వాసం మార్కు సువార్త 9:23 లో దేముడు ఇలా అన్నాడు "నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే"మనం దేవుని మీద నమ్మకం ఉంచితే దేముడు మన జీవితంలో మనం అనుకున్న కార్యం చేస్తాడు  బైబిల్ లో అనేక మంది విశ్వాసం ద్వారా అద్భుతాలు చూశారు శార వృద్ధాప్యంలో కుమారుడిని కన్నది విశ్వాసం ద్వారా  దావీదు గొలియాతును ఎదుర్కొన్నప్పుడు తన శక్తిని  కాదు దేవుని శక్తిని నమ్మడు దానియేలు సింహాల గృహలో ఉన్నప్పుడు కూడా దేవుడి మీద విశ్వాస కోల్పోలేదు దేవుని భక్తులు నమ్మారు కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు విశ్వాసం ఉన్న వ్యక్తి సమస్యలపై కాదు దేవుని పై దృష్టి పెడతాడు దేవునిపై విశ్వాసం ఉంచి ప్రార్థించాలి అప్పుడే మనం అద్భుతాన్ని చూస్తాం  నువ్వు  దేవుని మీద పెట్టుకున్న నీ విశ్వాసం నిన్ను స్వస్థ పరుస్తుంది నువ్వు అనారోగ్యంలో  ఉన్నప్పుడు ఈ విశ్వాసమే నిన్ను  బాగు చేస్తుంది  కీర్తన 46:1  లో దేముడు...

మన జీవితంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి?

  మన జీవితంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏది సరైనది ఏది సరైనది కాదు ఏ దారిలో వెళ్ళాలి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం  తెలుసుకోవడానికి  దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా అవసరం.   దేవుని చిత్తం తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పాయింట్లు  1) దేవుని వాక్యం రోజు చదవడం ద్వారా దేవుని చిత్తం తెలుసుకోగలం ప్రతి రోజు బైబిల్ చదివితే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతాడు  చదివిన వాక్యం లో మాట మన మనసుని తాకుతుంది ఆ వాక్యం తో దేముడు మాట్లాడుతాడు  నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై యున్నది  (కీర్తన 119:105) 2) ప్రార్ధన ద్వారా నీ చిత్తం ఏమిటి ప్రభువా అని అడగాలి ప్రార్ధన ద్వారా అడగడం మన మనసులో మాటను దేవుని ముందు ఉంచడం  3) పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కూడా దేముడు మాట్లాడుతాడు మన మనసులో కలిగే భావాలు శాంతి, హెచ్చరిక ,నడిపింపు పరిశుద్ధాత్మ నుండి వస్తుంది 4) దేవుని మార్గం లో నడిచే ఆత్మీయ దైవజనులు విశ్వాసులు వల్ల మాటల ద్వారా కూడా దేవుని చిత్తం తెలుస్తుంది మనకు ఒక స్పష్టత వస్తుంది  5) సహనం కలిగి వే...

చేప కడుపులో మూడు రోజులు ఉన్న ప్రవక్త ఎవరు?

 చేప కడుపులో మూడు రోజులు ఉన్న ప్రవక్త? ఎవరు అంటే   యోన దేవుడు యోన నీ నినీవే పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రజలకు పశ్చాత్తాపం గురించి ఆజ్ఞ ఇచ్చాడు కానీ దేవుని మాట వినకుండా యోన తర్షీషుకు పారిపోవాలి అని అనుకున్నాడు ఒక్క రోజు యోన  ఓడ లో ప్రయాణిస్తుండగా సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది ఓడలో ఉన్నవారు భయపడ్డారు యోన కారణము గా ఈ  తుఫాను వచ్చిందని తెలిసి అక్కడి ప్రజలందరూ యోనాను సముద్రంలో పడేశారు దేవుడు ఒక గొప్ప చేపలు అక్కడికి పంపించాడు  ఆ చేప యోన నీ మింగింది యోనా మూడు రోజులు మూడు రాత్రులు చేప పొట్టలో ఉన్నాడు యోనా తన తప్పులు తెలుసుకొని దేవునికి పశ్చాత్తాప పడ్డాడు దేవుడు కనికరించి యోనా ప్రార్థన విని ఆ చేపను యోనాన్ని  ఒడ్డు కి ఉమ్మమని ఆజ్ఞ ఇచ్చాడు  అప్పుడు  యోనా దేవుడు చెప్పిన పని చేయడానికి   నీనీవే పట్టణానికి వెళ్ళాడు అక్కడ దేవుని మాటలను ప్రకటించాడు తమ పాపాల నుండి మారకపోతే నాశనం అవుతారని హెచ్చరించాడు అప్పుడు నినీవే ప్రజలు పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి ప్రార్థించారు దేవుడు ఆ ప్రజల పశ్చాతాపం చూసి ఆ పట్నాన్ని నాశనం చేయలేదు ఈ కథలో నీతి ఏంటంటే దేవుని మాట ...

కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు

  కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు  జీవితం లో కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనసుకి ధైర్యంనిచ్చేది దేవుని వాక్యం  బైబిల్ వాక్యాలు చదివినప్పుడు శాంతి ఆశ బలం నీ ఇస్తాయి దేవుని వాక్యం చదవడం ద్వారా మనసుకు నెమ్మది కలుగుతుంది అందులో 10  ముఖ్యమైన శక్తివంతమైన వాక్యాలు  కీర్తన 34:19 "నీతిమంతునికి అనేక ఆపదలు కలుగును అయితే యెహోవా వాటన్నిటి లో నుండి అతనిని విడిపించును". యెషయా 41:10 "భయపడకుము, నేను నీతో ఉన్నాను దిగులుపడకము, నేను నీ దేవుడను." కీర్తన 46:1 "దేవుడు మనకు శరణు మరియు బలము; ఆపదలో అతి సమీప సహాయకుడు." మత్తయి 11:28 " శ్రమపడువారులారా,  భారములు మోసుకొనువారులారా, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను." రోమీయులకు 8:28 "దేవుని ప్రేమించువారికి సమస్తమును మేలుకే సహకరించును." యోహాను 16:33 "లోకంలో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యంగా ఉండుడి నేను లోకమును జయించితిని." కీర్తన 23: 4  మరణపు నీడయైన లోయలో నడిచినను నేను భయపడను, ఎందుకంటే నీవు నా తోడుగా ఉన్నావు." 1 పేతురు 5:7  "మీ భారంలన్నిటిని ఆయన మీద వేయుడి ఎందుకంటే ఆయన మీ విషయమే శ్ర...