విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి

విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి విశ్వాసం అనేది కనిపించని దానిపై నమ్మకం పరిస్థితులు అనుగుణంగా లేకపోయినా దేవుడు చేస్తున్నాడు అని హృదయ పూర్వకంగా నమ్మడం అదే నిజమైన విశ్వాసం

మార్కు సువార్త 9:23 లో దేముడు ఇలా అన్నాడు "నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే"మనం దేవుని మీద నమ్మకం ఉంచితే దేముడు మన జీవితంలో మనం అనుకున్న కార్యం చేస్తాడు 

బైబిల్ లో అనేక మంది విశ్వాసం ద్వారా అద్భుతాలు చూశారు శార వృద్ధాప్యంలో కుమారుడిని కన్నది విశ్వాసం ద్వారా  దావీదు గొలియాతును ఎదుర్కొన్నప్పుడు తన శక్తిని  కాదు దేవుని శక్తిని నమ్మడు దానియేలు సింహాల గృహలో ఉన్నప్పుడు కూడా దేవుడి మీద విశ్వాస కోల్పోలేదు దేవుని భక్తులు నమ్మారు కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు విశ్వాసం ఉన్న వ్యక్తి సమస్యలపై కాదు దేవుని పై దృష్టి పెడతాడు దేవునిపై విశ్వాసం ఉంచి ప్రార్థించాలి అప్పుడే మనం అద్భుతాన్ని చూస్తాం  నువ్వు  దేవుని మీద పెట్టుకున్న నీ విశ్వాసం నిన్ను స్వస్థ పరుస్తుంది నువ్వు అనారోగ్యంలో  ఉన్నప్పుడు ఈ విశ్వాసమే నిన్ను  బాగు చేస్తుంది 

కీర్తన 46:1  లో దేముడు ఇలా అన్నాడు 

దేవుడు మనకు ఆశ్రయము దుర్గము నై  ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపద వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చెయ్యకపోయినా దేముడు మనకు సహాయం చేస్తాడు దేవుని మీద నమ్మకం ఉంచాలి 




Comments

Popular posts from this blog

ప్రేయర్ ప్రాముఖ్యత

కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు

జ్ఞానం