మన జీవితంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి?

 మన జీవితంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి?

మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏది సరైనది ఏది సరైనది కాదు ఏ దారిలో వెళ్ళాలి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం  తెలుసుకోవడానికి  దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా అవసరం.  

దేవుని చిత్తం తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పాయింట్లు 

1) దేవుని వాక్యం రోజు చదవడం ద్వారా దేవుని చిత్తం తెలుసుకోగలం ప్రతి రోజు బైబిల్ చదివితే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతాడు  చదివిన వాక్యం లో మాట మన మనసుని తాకుతుంది ఆ వాక్యం తో దేముడు మాట్లాడుతాడు 

నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై యున్నది  (కీర్తన 119:105)

2) ప్రార్ధన ద్వారా నీ చిత్తం ఏమిటి ప్రభువా అని అడగాలి ప్రార్ధన ద్వారా అడగడం మన మనసులో మాటను దేవుని ముందు ఉంచడం 

3) పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కూడా దేముడు మాట్లాడుతాడు మన మనసులో కలిగే భావాలు శాంతి, హెచ్చరిక ,నడిపింపు పరిశుద్ధాత్మ నుండి వస్తుంది

4) దేవుని మార్గం లో నడిచే ఆత్మీయ దైవజనులు విశ్వాసులు వల్ల మాటల ద్వారా కూడా దేవుని చిత్తం తెలుస్తుంది మనకు ఒక స్పష్టత వస్తుంది 

5) సహనం కలిగి వేచిచూడడం ద్వారా దేవుని చిత్తం తెలుస్తుంది కొన్ని సార్లు దేముడు వెంటనే ప్రార్ధన కి జవాబు ఇవ్వడు సహనం గా వేచి చూడాలి 

దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఆయన తో సమయం గడపాలి  ప్రార్ధన చెయ్యాలి బైబిల్ చదవాలి పరిశుద్ధాత్మ మార్గదర్శనం గా ఉండాలి ఆత్మీయుల సలహా తీసుకోవాలి  ఇవి అన్ని చెయ్యడం ద్వారా దేవుని చిత్తం తెలుసుకోగలం 

Comments

Popular posts from this blog

ప్రేయర్ ప్రాముఖ్యత

కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు

జ్ఞానం